కాఫీవిత్…ఆర్.రమాదేవి.1536-ఎ.రజాహుస్సేన్

ప్రేమ కవితల కవయిత్రి ఆర్.రమాదేవి మార్క్ కవిత ఇది.‌..సైజులో మినీకవితే అయినా వస్తు
వస్తుపరంగా ప్రేమకవితే…ఈరోజు కాఫీటైమ్లో రమాదేవి కవితను చూద్దాం.!

“నాలో
గాఢ దుఃఖపు అలలు
ఎగిసిపడుతున్నప్పుడు
అలజడికి కారణమూ
దుఃఖమూ కూడా నీవే అయితే
ఇక....అర్థాలు వెదికే పనేముంది
ఓయ్..!
అంతా నువ్వయ్యాక
నాతో నాకెందుకో ఇంత పేచీ”!!
*ఆర్.రమాదేవి.

ప్రేమ పేరు వింటే ఆనందమే కానీ,ఈ రెండక్షరాల ప్రేమలోని ఝంఝాటం అంతా ఇంతాకాదు‌.అన్నీ
బాగుంటే ఓకే కానీ,ప్రేమికులమధ్య ఎడబాటు,విరహం సంభవిస్తేమాత్రం ఆ ప్రేమ ❤️ గుండె పై కత్తి
గాటే..దానివల్ల కలిగే సలపరాన్ని భరించడమంటేప్రతీ క్షణం దుఃఖ సముద్రంలో ఈదటమే..ఈ కవితలో
ప్రేయసి పరిస్థితి కూడా అచైచం ఇలానే వుంది. తనలో  గాఢ దుఃఖపు అలలు ఎగిసిపడుతున్నప్పు
డు ఆ అలజడికి కారణమూ, దుఃఖమూ కూడా…అతగాడే అయితే… ఇక అర్థాలు వెదికే పనేముంటుందామెకు.
అందుకే….,
అలజడికీ,దుఃఖానికీ కారణం అతగాడే అయ్యాక
ఈపేచీ తన కెందుకనుకొని తనకు తానే సర్దిచెప్పుకుంటోందామె..!!
*ఎ.రజాహుస్సేన్..!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!